హీరోయిన్ ప్రియమణి హాట్ పిక్స్సౌత్ హీరోయిన్ గా మంచి పేరే వచ్చినా, పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో చిన్నా చితకా సినిమాలు చేస్తుంది ప్రియమణి. చెప్పుకోవడానికి నేషనల్ అవార్డ్, మణిరత్నం సినిమాలో నటించడం వంటివి ఉన్నా ఎందుకో ప్రియమణిని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ అమ్మడు కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించినా, విచ్చలవిడిగా అందాలు ఆరబోసేసినా ఆడియన్స్ పట్టించుకోలేదు. దీంతో ప్రియమణి చూపు నార్త్ వైపు పడింది. మణిరత్నం రావన్ సినిమాతో హిందీలోకి అడుగుపెట్టిన ప్రియమణి ఆ ఆతరువాత అక్కడ సినిమాలు చేయలేదు. తాజాగా జెనీలియా భర్త రితీష్ దేశ్ ముఖ్ తో కలిసి నటించడానికి సై అందట. రితీష్ పెళ్ళి తరువాత సైన్ చేస్తున్న లేటెస్ట్ మూవీలో ప్రియమణి హీరోయిన్ గా నటిస్తుంది. చంద్రకాంత్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ లో సుడి తిరిగితే అయినా ప్రియమణిని సౌత్ ఇండస్ట్రీ పట్టించుకుంటుందేమో చూడాలి.

ప్రియమణి హాట్ స్టిల్స్ ఇన్ రెడ్ – priyamani hot stills in red

Tags: , , , , ,