కమెడియన్ సునీల్ పూలరంగడుపూలరంగడు సినిమాతో అల్ మోస్ట్ కమెడియన్ నుంచి హీరో స్థాయికి ఎదిగిన సునీల్ మరో సినిమా చేస్తున్నాడు. అందాలరాముడు, మర్యాదరామన్న తరువాత హీరోగా సినిమాలు చేయడానికి కొంత టైమ్ తీసుకున్న సునీల్, ఈ సారి మాత్రం పూలరంగడు హిట్ తో కొద్ది రోజులకే హీరోగా మరో సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నాడు. బాలీవుడ్ లో హిట్ అయిన తను వెడ్స్ మను సినిమాకి తెలుగు రీమేక్ గా రూపొందుతున్న సినిమాలో హీరోగా సునీల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సునీల్ సరసన మరోసారి ఇషాచావ్లా నటిస్తుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పూలరంగడు హిట్ అయ్యింది. దీంతో తరువాత సినిమాకి కూడా ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారు. ఇమేజ్ సమస్య లేకుండా ఉండటంతో ఇషాను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి సునీల్ భారీ మొత్తంగా మూడు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.

Tags: , , , , , , ,