రవితేజ తాప్సిల దరువురవితేజ సినిమాకు మరోసారి తెలంగాణ సెగ తగిలింది. ఇప్పటికే పలుమార్లు రవితేజ చేస్తున్న సినిమా షూటింగ్ లను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. తాజాగా రవితేజ చేస్తున్న దరువు సినిమాకి కూడా తెలంగాణవాదులు అభ్యంతరం చెప్పారు. తార్నాకలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దరువు సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఉస్మానియా యూనివర్శిటీ తెలంగాణ విద్యార్ధులు షూటింగ్ కు అభ్యంతరం చెప్పారు. హాస్పటిల్ ముందు చేరి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రవితేజను హాస్పటిల్ వెనుక గేటు నుంచి బయటకు పంపించేసారు. సినిమా షూటింగ్ రద్దు అయ్యింది. గోపీచంద్ తో శౌర్యం సినిమా తీసిన శివ డైరక్షన్ లో రవితేజ ఈ సినిమా చేస్తున్నాడు. సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ దరువులో తాప్సి హీరోయిన్ గా నటిస్తుంది.

Tags: , , , , , , , ,