ఈ రోజు appsc( ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ) రెండు ముఖ్యమైన పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. రెండు గ్రూప్స్ కు చెందినవి కావడం విశేషం. గ్రూప్ 1 రాత పరీక్షలు, ఇంటర్వ్యూలకు హాజరయిన అభ్యర్ధుల్లో ఎవరు ఉద్యోగాలు సంపాదించారో ఏపిపిఎస్సీ విడుదల చేసింది. చరిత్రలో మొదటిసారి ఏయే అభ్యర్ధి ఏ పోస్ట్ కు ఎంపిక అయ్యారో కూడా ఏపిపియస్సీ తెలియజేసింది. గ్రూప్ 1 కు సెలక్ట్ అయిన అభ్యర్ధుల జాబితా ఇక్కడ చూడవచ్చు.
గ్రూప్ 2 రాత పరీక్షలు రాసిన అభ్యర్ధులు ఫలితాలను ఇక్కడ చూసుకోవచ్చు. గ్రూప్ 2 రాత పరీక్షలో సెలెక్ట్ అయిన అభ్యర్ధులు మార్చి మూడవ తేదీ నుంచి ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.
మరిన్ని పరీక్షాఫలితాల కోసం చదువు.తెలుగువాహిని.కామ్





