రామ్ చరణ్ లేటెస్ట్ మూవి రచ్చ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతుంది. ఆరెంజ్ వంటి ఫ్లాప్ తరువాత భారీ అంచనాలతో రామ్ చరణ్ చేస్తున్న సినిమా ఈ రచ్చ. ఇప్పటికే 90శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న రచ్చ మూవి వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఆడియో రిలీజ్ మార్చి 4వ తేదీన జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. సాధారణంగా సినిమా ఫంక్షన్లు హైదరాబాద్ లోనే జరుగుతాయి. అయితే ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితి మారుతుంది. రాష్ట్రం నలుమూలల సినిమా ఫంక్షన్లు చేస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ రచ్చ ఆడియో వేడుకను కర్నూలు టౌన్ లో చేయబోతున్నారు. ఇందుకు నిర్మాత n.v ప్రసాద్ భారీగా సన్నాహాలు చేస్తున్నారు. వేలాది మంది ఫ్యాన్స్ వస్తారనే అంచనాలతో ఏర్పాట్లు చేయనున్నారు. రచ్చ ఆడియో రిలీజ్ కు అగ్ర దర్శకులు రాజమౌళి, వి.వి వినాయక్ తో పాటు తమిళ్ డైరక్టర్ శంకర్ కూడా వస్తారనే ప్రచారం జరుగుతుంది. అధికారికంగా రచ్చ ఆడియో రిలీజ్ మార్చి నాలుగున జరుగుతున్నా అనధికారికంగా టైటిల్ సాంగ్ నెట్ లో లీక్ అయ్యింది. ఈ పాటకు పుల్ క్రేజ్ రావడంతో రచ్చ ఆడియో రైట్స్ కోటి రూపాయలకు అమ్ముడుపోయాయి. పైరసీతో ఆడియో మార్కెట్ కుదేలు అవుతున్న రోజుల్లో కోటి రూపాయలకు ఆడియో రైట్స్ అమ్ముడుపోవడం టాలీవుడ్ లో లేటెస్ట్ సెన్సేషన్. రచ్చలో రామ్ చరణ్ కు జోడీగా తమన్నా నటిస్తుంది. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
రచ్చ టైటిల్ సాంగ్ ఇదే:


